ఈ మధ్య మూవీస్ కంటే పెళ్లి రూమర్స్‌తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది లావణ్య త్రిపాఠి

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి పెళ్లి  చేసుకోబోతున్నారంటూ గతంలో జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే

ఇప్పటికే ఇవన్ని వట్టి రూమర్స్‌ అని లావణ్య  క్లారిటీ ఇవ్వడంతో ఈ రూమర్లకు చెక్‌ పడింది

అయితే ఇటీవల తన మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ షోలో లావణ్య వరుణ్‌ తేజ్‌ మోస్ట్‌ హ్యాండ్సమ్‌ అంటూ కామెంట్‌ చేసారు

దీంతో మరోసారి ఈ ఏడాదే వరుణ్‌-లావణ్యల పెళ్లి అంటూ పుకార్లు గుప్పుమన్నాయి

కాగా లావణ్య నటించిన తాజా చిత్రం ‘పులిమేక’ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ చానల్‌ ఇంటర్వ్యూ లో లావణ్యకు తన పెళ్లి పుకార్లపై ప్రశ్న ఎదురైంది

‘ప్రతి ఒక్కరు నా పెళ్లి గురించే మాట్లాడుతున్నారు ఎందుకు. సమయం వచ్చినప్పుడు అదే జరుగుతుంది’ అని ఆమె స్పందించింది

అనంతరం  ‘టైం గాడ్‌ నేను చాలా అదృష్టవంతురాలిని. ఎందుకంటే పెళ్లి విషయంలో నా తల్లింద్రుడులు నన్ను ఇబ్బంది పెట్టడం లేదు

ప్రస్తుతం నా ఫోకస్‌ అంతా కెరీర్‌, సినిమాలపైనే ఉంది. కానీ, పెళ్లిపై నాకు నమ్మకం ఉంది. మన లైఫ్‌లోకి కరెక్ట్‌ పర్సన్‌ వచ్చినప్పుడే అది జరుగుతుంది

అప్పుటి వరకు వేచి చూడాలి. నచ్చిన వ్యక్తి మన లైఫ్‌లోకి వచ్చినప్పుడు మాత్రమే పెళ్లి అనేది అందంగా ఉంటుంది’ అని ఆసక్తిగా సమాధానం చెప్పింది లావణ్య త్రిపాఠి