దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ కంపెనీల్లో రిలయన్స్ కూడా ఒకటి.
ఈ క్రమంలో రిలయన్స్ తన సొంత బ్రాండ్లతో FMCG రంగంలోకి ప్రవేశించి భారతీయ రిటైల్ మార్కెట్‌లో సత్తా చాటుతుంది.
వేసవిలో కూల్ డ్రింక్స్ విక్రయంలోకి క్యాంపాకోలాను లాంచ్ చేసి పెప్సీ, కోకాకోలాలకు గట్టి పోటీని ఇచ్చింది.
తాజాగా రిలయన్స్ గ్రూప్ తన మార్చి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.
మార్చి 31 తేదీన ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ రూ.2,415 కోట్ల లాభాన్ని వెచ్చించింది.
గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో వచ్చిన రూ.2,139 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 13 శాతం అధికం.
కాగా రిలయన్స్ రిటైల్ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో రూ.50,834 కోట్ల ఉండగా 21 శాతం పెరిగి.. రూ.61,559 కోట్లకు చేరుకుంది.
జియో మార్ట్ పేరుతో రిటైల్, హోల్ సేల్ వ్యాపారాన్ని నిర్వహిస్తూన్న రిలయన్స్ రిటైల్ దేశవ్యాప్తంగా 15,000 కంటే ఎక్కువ స్టోర్లు నిర్మించింది.
ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో కంపెనీ కొత్తగా 966 స్టోర్లను ప్రారంభించింది.
ఇదిలా ఉంటె కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో దాదాపు 35 శాతం, లైఫ్ స్టైల్ సెగ్మెంట్ విభాగంలో 19 శాతం రాబడిని పెంచుకుంది.