మనం వాడే స్మార్ట్‌ఫోన్లలో కొన్ని మొబైల్స్‌ బ్రాండ్‌ను బట్టి ఊరికే హీటవుతుంటాయి.ఈ నేపథ్యంలో సూరీడు వేడికి అవి మరింత వేడెక్కుతుంటాయి.

ప్రస్తుతం మన జీవితంలో ఓ ముఖ్యమైన భాగంగా మారిపోయిన స్మార్ట్‌ఫోన్‌ తరచుగా హీటవుతుంటే, దాని సామర్థ్యం, పనితీరుపై ప్రభావం పడుతుంది.

ఇలా హీటెక్కే ఫోన్లను సమ్మర్లో మీ దగ్గర పెట్టుకుని తిరగడం కూడా ప్రమాదకరమే. ఈ నేపథ్యంలో వేసవిలో మీ సాన్ట్‌ఫోన్‌ కూల్‌ అయ్యేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి.

ఆ టిప్స్‌ ఏంటో ఇప్పుడే చూసెద్దాం. స్మార్ట్‌ఫోన్‌ వాడే వారిలో చాలా మంది ఫుల్‌ ఛార్జ్‌ కావాలని రాత్రంతా ఛార్జింగ్‌ పెట్టేస్తుంటారు.

ఈ కారణంగా కూడా మీ ఫోన్‌ ఓవర్‌ హీట్‌ అవ్వడంతో పాటు బ్యాటరీ కూడా వీక్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. అందుకే మీ స్మార్ట్‌ఫోన్‌ను ఓవర్‌ ఛార్జ్‌ చేయకండి.

దీనివల్ల మీ ఫోన్‌ హీట్‌ పెరిగి బ్యాటరీ మొత్తం పాడయ్యే అవకాశం ఉంది. అలాగే మీ ఫోన్లు పిల్లో లేదా దుప్పటి కింద ఉంచడం వంటివి చేయొద్దు.

యాపిల్‌ కంపెనీ ప్రకటన ప్రకారం.. 35 డిగ్రీల సెల్లియస్‌ కంటే ఎక్కువ హీట్‌ ఉండే ప్రాంతంలో ఐఫోన్‌ ఉంచితే, దాని బ్యాటరీకి హాని కలుగుతుందని ప్రకటించింది.

మీ స్మార్ట్‌ఫోన్లు కూడా తన చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టి వేడిని గ్రహిస్తాయి. అందుకే మీ ఫోన్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను సూర్యకాంతి తగలకుండా ఉంచాలి.