సాధారణంగా మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు లేదా బండిపై వెళ్తున్నప్పుడు రోడ్డుపై డబ్బులు దొరుకుతుంటాయి.
అయితే దొరికిన డబ్బు తీసుకుంటే కలిసిరాదని కొంతమంది.. రోడ్డుపై డబ్బులు దొరకడం మంచిదా? కదా? అనేది చాలా మందికి తెలియదు.
అయితే పూర్వికులు చెప్పిన వివరాల ప్రకారం రోడ్డుపై డబ్బు కనిపిస్తే మంచిదంట. మనకు రోడ్డుపై నాణెం కనిపిస్తే పూర్వీకుల ఆశిర్వాదం దక్కుతుంది.
ఆ సమయంలో మీరు ఏదైనా పనిని శ్రమతో చేస్తా తప్పకుండా విజయం సాధిస్తారు.
ఇక ఏదైనా పనిని ముగించుకొని ఇంటికి వస్తుంటే మార్గం మధ్యలో డబ్బు కనిపిస్తే ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతాయి.
ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్తున్న సమయంలో నాణెం దొరికితే మీరు చేయబోయే పనిలో విజయం సాధిస్తారని అర్ధం.
ఈ కథనం మాకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఇది వాస్తవం అని టీవీ9 కచ్చితంగా చెప్పడం లేదు.