మన నోట్లో బ్యాక్టీరియా ఉంటుంది. దాదాపు 700 రకాల బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మక్రిములకు నిలయమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఈ సూక్ష్మక్రిములు మన లాలాజలంలో, దంతాలు, నాలుక, దవడలు, ఇతర నోటి లోపలి భాగాలపై ఉంటాయి. లాలాజలం మంచి, చెడు బ్యాక్టీరియాలను సమతుల్యత చేస్తుంది

కొన్ని రకాల బ్యాక్టిరియాలు వివిధ కారణాల వల్ల కాలక్రమేణా మరింత సమృద్ధిగా, హానికరంగా మారుతుంటాయి

డెంటల్‌ క్యావిటీస్‌ మనం ముద్దు పెట్టుకోవడం ద్వారా సంభవించవచ్చని పేర్కొంటున్నారు

ముద్దు పెట్టుకోవడం ద్వారా.. మన నోటిలోకి అనేక హానికరమైన బ్యాక్టీరియాలు చేరి ఈ సమస్యకు దారితీస్తుంది.

కొన్ని హానికరమైన బ్యాక్టీరియాలు ఒకరి నుంచి మరొకరికి చేరి డెంటల్ క్యావిటీలకు, వ్యాధులకు దారితీసే అవకాశం ఉంటుంది

కావున ముద్దు పెట్టుకునే సమయంలో ఒకరి నోటి నుంచి మరొకరి నోట్లోకి లాలాజలం పోకుండా చూడాలి. పెదవులపై ముద్దులకే పరిమితం కావాలని సూచిస్తున్నారు.