ఆహారం ద్వారా లభించే కేలరీలు, శరీరం ఖర్చు చేసుకునే కేలరీలను బట్టి బరువు ఆధారపడి ఉంటుంది.
నిర్ణీత ఉపవాసంతో కేలరీల లోపం ఏర్పడుతుంది. అంటే తీసుకునే కేలరీల కన్నా ఎక్కువ ఖర్చవుతాయన్నమాట.
సాధారణంగా మనం రోజుకు 4-5 సార్లు భోజనం, చిరుతిళ్లు (సుమారు 2,500 నుంచి 3వేల కేలరీలు) తింటుంటాం.
నిర్ణీత ఉపవాసంతో తీసుకునే కేలరీలు తగ్గుతాయి. కాబట్టి బరువూ తగ్గుతుంది.
అదీ భోజనం చేసే సమయంలో ఎక్కువగా తినకపోతేనే. 7,700 కేలరీల లోపంతో కిలో బరువు తగ్గుతుంది.
దీన్ని ఉపవాసంతోనే కాదు, భోజనం పరిమాణాన్ని తగ్గించుకోవటం ద్వారానూ సాధించొచ్చు.
దీనికి వ్యాయామం కూడా తోడైతే మరింత వేగంగా బరువును తగ్గించుకోవచ్చు.