శరీరానికి సరైన స్థాయిలో ఐరన్ అవసరం. అందుకే దీనిపై అందరూ దృష్టి సారించాలని హెచ్చరిస్తున్నారు.

ఐరన్ ఎర్ర రక్త కణాలలో ముఖ్యమైన భాగం. ఇనుము సహాయంతో, ఆక్సిజన్ శరీరం అంతటా రవాణా అవుతుంది.

ఐరన్ లోపం ఉంటే కొన్ని లక్షణాలు కనిపిస్తాయని.. అలా ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిదని పేర్కొంటున్నారు.

ఐరన్ లోపం ఉంటే.. కాళ్లలో తిమ్మిర్లు, మంట, నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఐరన్ లోపం ఉంటే నాలుక వాపు కనిపిస్తుంది. వాపుతో పాటు, నాలుక రంగు కూడా మారుతుంది.

పెదవులు పగిలిపోవడం, నోటి మూలల్లో పగుళ్లు, నోటి పూత, అల్సర్లు లాంటివి కనిపిస్తాయి.

ఐరన్ లోపం ఉండే వారు.. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఈ సమస్య నుంచి తేలికగా బయటపడొచ్చు.