చాలామంది మహిళలు శరీరంలో ఐరన్ లోపంతో బాధపడుతుంటారు.
అలాంటి వారు పరగడుపున కొన్ని చిట్కాలను అవలంబించడం ద్వారా రక్తహీనత సమస్యను దూరం చేసుకుని ఆరోగ్యంగా ఉండవచ్చు
ఐరన్ లోపం ఉన్న వారు ఉదయాన్నే బీట్‌రూట్, క్యారెట్ జ్యూస్ తాగితే సమస్య నుంచి బయటపడొచ్చు.
మునగ ఆకులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో 1 స్పూన్ మునగ ఆకుల పొడిని నీటిలో కలిపి తీసుకోండి.
ఖర్జూరం, అత్తి పండ్లు, ఎండు ద్రాక్షలు ఐరన్ లోపం నుంచి బయటపడేలా చేస్తాయి.
వీట్‌గ్రాస్ కూడా ఐరన్ లోపాన్ని నివారించి.. ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది.
నువ్వుల గింజలు కూడా రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి. దీనిలోని పోషకాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.