ఐపీఎల్‌ 2023లో సిక్సర్ కింగ్ ఎవరో తెలుసా?

IPL సీజన్ 16లో చెన్నై విజేతగా నిలిచింది. దీంతో 5వసారి ట్రోఫీని అందుకుంది.

టోర్నీలో కొందరు ఆటగాళ్లు భారీ సిక్సర్లతో సందడి చేశారు.

ఈసారి ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ ఎవరో చూద్దాం...

1- ఫాఫ్ డుప్లెసిస్: RCB ప్లేయర్ 36 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

2- శివమ్ దూబే: CSK మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శివమ్ దూబే 14 ఇన్నింగ్స్‌లలో మొత్తం 35 సిక్సర్లు కొట్టాడు.

3- శుభ్‌మన్ గిల్: గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 16 ఇన్నింగ్స్‌లలో 33 సిక్సర్లు కొట్టాడు.

4- గ్లెన్ మాక్స్‌వెల్ RCB తరపున 14 ఇన్నింగ్స్‌లలో 31 సిక్సర్లు కొట్టాడు.

5- రుతురాజ్ గైక్వాడ్: CSK ఓపెనర్ రుతురాజ్ 15 ఇన్నింగ్స్‌లలో మొత్తం 30 సిక్సర్లు కొట్టాడు.

6- రింకూ సింగ్: కేకేఆర్ తరపున రింకూ సింగ్ 14 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 29 సిక్సర్లు కొట్టాడు.