హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపీఎల్ 2023లో మూడో సారథిగా..
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఏప్రిల్ 13న మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (PBKS), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య 18వ లీగ్ మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ 1 బంతి మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
గుజరాత్ టీం బంతితో, బ్యాటింగ్‌తో అద్భుతమైన ఆటను కనబరిచింది.
ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యా రూ. 12 లక్షల జరిమానాను ఎదుర్కోవాల్సి వచ్చింది.
హార్దిక్ పాండ్యా జట్టు నిర్ణీత గడువులోగా 20 డెలివరీలు వేయలేకపోయింది.
ఈ కారణంగా ప్రవర్తనా నియమావళి ప్రకారం హార్దిక్‌పై రూ.12 లక్షల జరిమానా విధించారు.
స్లో ఓవర్ రేట్‌కు సంబంధించి IPL ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్‌లో జట్టు చేసిన మొదటి నేరం. కాబట్టి, రూ. 12 లక్షల జరిమానా విధించారు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు చాలా మ్యాచ్‌లు 4 గంటలకు పైగా పూర్తయ్యాయి.
అయితే ఒక టీ20 మ్యాచ్‌ను పూర్తి చేయడానికి 3 గంటల 20 నిమిషాల కాల పరిమితిని నిర్ణయించారు.
ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాను ఎదుర్కొన్న మొదటి కెప్టెన్ హార్దిక్ పాండ్యా కాదు.
లక్నోతో జరిగిన మ్యాచ్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ రూ. 12 లక్షల జరిమానాను ఎదుర్కొన్నారు.
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత స్లో ఓవర్ రేట్ కారణంగా సంజుకు జరిమానా పడింది.