ఐపీఎల్ హిస్టరీలో అత్యంత చెత్త బౌలింగ్.. టాప్ 3లో చేరిన సచిన్ కుమారుడు..

ఐపీఎల్ 2023 సీజన్‌లో అరంగేట్రం చేసిన యువ ఆల్-రౌండర్ అర్జున్ టెండూల్కర్‌కు,  మూడవ మ్యాచ్‌లో చెత్త రికార్డులో చేరాడు.

వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరిగిన మ్యాచ్‌లో అర్జున్ తన 3 ఓవర్‌లో 31 పరుగులు ఇచ్చాడు.

ఇది ఇప్పటివరకు ఈ సీజన్‌లో రెండవ అత్యంత ఖరీదైన ఓవర్‌గా మారింది.

ఐపీఎల్ చరిత్రలో ముంబై నుంచి ఇది రెండవ అత్యంత ఖరీదైన ఓవర్‌గా నిలచింది.

ఈ ఓవర్‌లో అర్జున్ 2 సిక్సర్లతో 4 ఫోర్లు ఇచ్చాడు. ఇది కాకుండా 1 వైడ్, ఒక నో బాల్, ఓవర్‌లో సింగిల్ రన్ కూడా వచ్చాయి.

మొత్తం 3 ఓవర్లలో అర్జున్ 1 వికెట్ తీసుకుని, మొత్తం 48 పరుగులు ఇచ్చాడు.

ఈ మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ తన పేరిట మరో చెడ్డ రికార్డును లిఖించుకున్నాడు.

IPLలో ముంబై ఇండియన్స్ తరపున రెండవ చెత్త బౌలర్‌గా నిలిచాడు.

గత సీజన్‌లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగులు చేసిన డేనియల్ సైమ్స్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు.

తాజాగా అర్జున్ టెండూల్కర్ నంబర్ 2వ స్థానంలో నిలిచాడు.

2014 సీజన్‌లో RCBపై ఒకే ఓవర్‌లో 28 పరుగులు ఇచ్చిన పవన్ సుయాల్ పేరు మూడో స్థానంలో ఉంది.