IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్ బెస్ట్ ప్లేయింగ్ XI

11. టి. నటరాజన్ 2017 సీజన్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. 2018 నుంచి ఎస్ఆర్‌హెచ్ తరపున ఆడుతున్నాడు.

10. శ్రేయాస్ గోపాల్ 28 ఏళ్ల లెగీ 48 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. ఇందులో 48 వికెట్లు పడగొట్టాడు. 2014 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. నాణ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు.

9. భువనేశ్వర్ కుమార్ భువీకి 132 ఐపీఎల్ మ్యాచులు ఆడిన అనుభవం ఉంది. ఇందులో 25.27 సగటుతో 142 వికెట్లు పడగొట్టాడు. 2022 సీజన్‌లో 150 వికెట్లను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.

8. వాషింగ్టన్ సుందర్ 42 ఐపీఎల్ మ్యాచుల్లో 27 వికెట్లు తీశాడు. అలాగే 26 ఇన్నింగ్స్‌ల్లో 217 పరుగులు చేశాడు. పవర్ ప్లేలో బౌలింగ్ చేసినా 6.94 ఎకానమీతో దూసుకెళ్తున్నాడు.

7. రొమారియో షెపర్డ్ వెస్టిండీస్ తరపున 14 టీ20ఐలు ఆడి, 160పైగా స్ట్రైక్ రేట్‌తో కేవలం 5 ఇన్నింగ్స్‌ల్లో 117 పరుగులు చేశాడు. షెపర్డ్ ఆల్ రౌండ్ నైపుణ్యం ఎస్‌ఆర్‌హెచ్‌కు ఎంతగానో లాభం చేకూర్చనుంది.

6. అభిషేక్ శర్మ U19 ప్రపంచ కప్ 2018 గెలిచిన టీమిండియా జట్టుకు అభిషేక్ శర్మ కెప్టెన్‌గా ఉన్నాడు. అలాగే ఆసియా కప్ గెలిచాడు. ఐపీఎల్‌లో రాణించే సత్తా కలిగి ఉన్నాడు.

5. అబ్దుల్ సమద్ సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగిన ఈ జమ్మూ కాశ్మీర్ ప్లేయర్ ఎంతగానో ఆకట్టుకున్నాడు. భారీ సిక్సర్లు కొట్టే సత్తా కలిగి ఉన్నాడు. ఎస్‌ఆర్‌హెచ్ మిడిలార్డర్‌లో తనదైన శైలిలో మెరుపులు కురిపించేందుకు రెడీ అయ్యాడు.

4. నికోలస్ పూరన్ పూరన్ 33 ఐపీఎల్ మ్యాచుల్లో 606 పరుగులు చేశాడు. ఇందులో 154 పైగా స్ట్రైక్ రేట్‌తో రన్స్ చేశాడు. వికెట్ కీపింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు.

2. కేన్ విలియమ్సన్(కెప్టెన్) కీవీ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 63 ఐపీఎల్ మ్యాచుల్లో 40.11 సగటుతో 1885 పరుగులు చేశాడు. 2018లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా నిలిచి, ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.

1. రాహుల్ త్రిపాఠి 2022లో 8.50కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. 62 మ్యాచుల్లో 1385 పరుగులు చేశాడు. కేకేఆర్‌ మిడిలార్డర్‌లో కీలక ప్లేయర్‌గా రాణించాడు.