ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి అవగాహన ఈ తరం యువతకు ఉండడం వల్ల వినూత్న ఆలోచనలతో ముందుకువస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌ మీర్జాపూర్ జిల్లాలోని కేంద్రీయ విద్యాలయ ప్రాంగణంలో డివిజనల్ స్థాయి సైన్స్ మోడల్ పోటీలు జరిగాయి.

2023 జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో  తమ నమూనాలను ప్రదర్శించారు విద్యార్థులు.

ఈ సైన్స్ ఎగ్జిబిషన్‌లో జవహర్ నవోదయ విద్యాలయకు చెందిన విద్యార్థి ఐ.ఎస్.నారాయణ్ శుక్లా ఎలక్ట్రో షూలను తాయారు చేసాడు.

ఈ షూ ధరించడం వల్ల సింగిల్ స్టెప్ వేస్తే 12.4 వోల్టుల విద్యుత్తును ఉత్పత్తి అవుతుందని నారాయణ్ చెబుతున్నాడు.

దీన్ని తయారు చేయడానికి కేవలం రూ.175 మాత్రమే ఖర్చు అయ్యింది. 3 కి.మీ నుంచి 4 కి.మీ ఈ షూతో పరిగెత్తితే 90 శాతం ఛార్జ్ అవుతుంది.

దానితోపాటు ఒక రోజులో షూల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి  మిలియన్ వోల్టుల విద్యుత్తును ఉత్పత్తి చేయగల టైల్స్‌ను తాయారు చేసాడు

ఇందులో ఉన్న ఈసీపీ అనే పరికరం ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్తును విక్రయించవచ్చు