కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో 1929 నవంబరు 4వ తేదీన శకుంతలా దేవి జన్మించారు. 

ముక్కుపచ్చలారని మూడేళ్ల వయసులోనే తనకు లెక్కల్లో అపరిమితమైన పట్టుందని ఆమె గ్రహించారు.

పట్టుమని 6 ఏళ్లు కూడా నిండకుండానే లెక్కల్లో తన ప్రతిభను చాటుకునేలా మైసూర్ యూనివర్సిటీలో ప్రదర్శన ఇచ్చి ఆశ్చర్యపరచారు

1944లో లండన్ వెళ్లిపోయిన శకుంతలాదేవి పేరు ఆ తరువాతి కాలంలో ప్రపంచమంతా మారుమోగింది.

శకుంతలా మంచి మాటకారి, రచయిత్రి, జోస్యం చెబుతారు, లెక్కల్లో ఈమెకున్న ప్రావీణ్యం ఫాస్టెస్ట్ హ్యూమన్ కంప్యూటర్ కు మించినది. 

 'మైండ్ డైనమిక్స్' అనే సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసిన శకుంతలా దేవి, కంప్యూటర్ కంటే మానవ మేథస్సు గొప్పని, వేగవంతమైనదని సంపూర్ణంగా విశ్వసిస్తారు.

1982 నాటికే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన ఈమెకు హీరోయిన్ అంత పాపులారిటీ, ఇమేజ్ ఆ కాలానికే ఉండేది.

స్వలింగ సంపర్కులను చులకన చేయడం శకుంతలకు నచ్చేది కాదు. ఆ భావనతో ఆమె 'ద వరల్డ్ ఆఫ్ హోమోసెక్సువల్స్' అనే పుస్తకం స్వయంగా రాయడం సంచలనం సృష్టించింది.

రాజకీయాలంటే శకుంతలకు చాలా ఇష్టం. స్వతంత్ర అభ్యర్థిగా లోక్ సభకు రెండు చోట్ల నుంచి పోటీ చేసిన ఆమె ఓటమిపాలయ్యారు.

ఎంత పెద్ద నంబరు అయినా గణిత సమస్యను కేవలం సెకెండ్లలో పరిష్కరించి, అదికూడా నోటితోనే సమాధానం చెప్పడం ఈమె ప్రత్యేకత.

2013, ఏప్రిల్ 21న, 83 ఏళ్ల వయసులో శకుంతలా దేవి బెంగళూరులో మరణించారు.