1970లో ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా.. మొరార్జీ దేశాయ్ ఆకస్మిక రాజీనామాతో, ఆమె ఆర్థిక మంత్రిత్వ శాఖను స్వీకరించారు

ఫిబ్రవరి 28 న బడ్జెట్ సమర్పించడానికి వచ్చారు. ప్రజలు ఆమె మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఎదురుచూశారు

ఆమె ప్రసంగానికి లేచి నిలబడితే చప్పట్లు మారుమోగాయి

కానీ ఆమె నన్ను క్షమించండి అని చెప్పడంతో ఒక్కసారిగా నిశ్శబ్దం వ్యాపించింది

అందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకోవడం మొదలుపెట్టారు

ఇందిర చిరునవ్వుతో ‘సారీ, ఈసారి సిగరెట్ తాగేవారి జేబుల భారం పెంచబోతున్నాను’ అని పదే పదే చెప్పారు

విపక్షాలకు అప్పుడు విషయం అర్థమైంది. గాంధీ.. సిగరెట్లపై 3% పన్నును 22%కి పెంచారు. సిగరెట్లపై పన్ను ఏకంగా 633% పెరిగింది

ఈ వార్త తెలిసిన వెంటనే దేశవ్యాప్తంగా అందరి ఇళ్ళల్లో మహిళలు హర్షాన్ని వ్యక్తం చేసినట్లు అప్పట్లో మీడియా రిపోర్ట్ చేసింది