Sania Mirza Retires: ఓటమితో కెరీర్ ముగించిన సానియా మీర్జా..
భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన కెరీర్‌లో చివరి మ్యాచ్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
డబ్ల్యూటీఏ దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఛాంపియన్‌షిప్ తొలి రౌండ్‌లో సానియా, ఆమె భాగస్వామి మాడిసన్ కీస్ వరుస సెట్లలో ఓటమిని ఎదుర్కొన్నారు.
ఈ జోడీని 4-6, 0-6తో వెర్నోకియా కుడెర్మెటోవా, లియుడ్మిలా శాంసోనోవా ఓడించారు. సానియా మీర్జా ఇటీవలే టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
2009లో సానియా తన కెరీర్‌లో మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకుంది.
ఆమె ఆస్ట్రేలియన్ ఓపెన్ 2009లో మహేష్ భూపతితో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ ఛాంపియన్‌గా నిలిచింది.
ఫ్రెంచ్ ఓపెన్ 2012, US ఓపెన్ 2014 మిక్స్‌డ్ డబుల్స్‌లో కూడా టైటిల్స్ సాధించింది.
2015లో సానియా వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లలో మహిళల డబుల్స్ టైటిల్స్ గెలుచుకుంది.
2016లో, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహిళల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది.
సానియా తన కెరీర్‌లో మొత్తం 6 డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుచుకుంది.
అలాగే ఏప్రిల్ 13, 2005న తొలిసారి సానియా మహిళల డబుల్స్‌లో నంబర్ 1 ర్యాంక్ సాధించింది.
ఇక దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఛాంపియన్‌షిప్ సానియాకు చివరి మ్యాచ్‌గా నిలిచింది.