గాయం కారణంగా రిటైర్మెంట్ ప్లాన్‌లో మార్పు.. భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ ప్రకటన..

సానియా మీర్జా తన రిటైర్‌మెంట్ ప్లాన్‌ను మార్చుకునేందుకు సిద్ధమవుతోంది.

US ఓపెన్ 2022 నుంచి కూడా వైదొలిగింది. నిజానికి దీని వెనుక కారణం ఏంటంటే ఆమె గాయం.

ఈ విషయాన్ని సానియా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

రెండు వారాల క్రితం కెనడాలో ఆడుతున్నప్పుడు మోచేయికి గాయమైనట్లు తెలిపింది.

స్కాన్ చేసిన తర్వాత గాయం తీవ్రత ఎక్కువ ఉన్నట్లు తేలింది.

ఈ కారణంగా దాదాపు వారం రోజుల పాటు కోర్టుకు దూరంగా ఉండాల్సి వస్తుందని సానియా ప్రకటించింది.

యూఎస్ ఓపెన్ నుంచి తన పేరును ఉపసంహరించుకున్నట్లు తెలిపింది.

దీంతో తన రిటైర్‌మెంట్ ప్లాన్‌ను కూడా మారుస్తుందని సానియా చెప్పుకొచ్చింది.

ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఓటమితో 2022 సీజన్ తర్వాత కోర్టుకు వీడ్కోలు పలుకుతానని భారత స్టార్ ప్రకటించింది.

US ఓపెన్ ఆమెకు చివరి టోర్నమెంట్‌గా భావించారు. ఇప్పుడు కోలుకున్న తర్వాత మేజర్ టోర్నీలో పాల్గొనడం ద్వారా కెరీర్‌ను ముగిస్తుందని అంటున్నారు.