Fill in some text
ఆసియాలోనే చెత్తగా పనిచేస్తున్న కరెన్సీగా రూపాయి.
ఒక్క ఏడాదిలోనే భారీగా దిగజారిన భారత రూపాయి. 2013 తరువాత ఇదే పెద్ద పతనం.
ఒకవైపు ద్రవ్యోల్బణం ముంచేస్తున్న వేళ రూపాయి బాగా బక్క చిక్కింది.
2022 ఒక్క సంవత్సరంలోనే భారత రూపాయి 10.14% పతనంతో చెత్తగా పని చేస్తున్న ఆసియా కరెన్సీగా రికార్డు సృష్టించింది.
డాలర్‌తో రూపాయి విలువ 82.72 వద్ద సంవత్సరాన్ని ముగించింది. 2021 చివరిలో భారత రూపాయి విలువ 74.33 గా ఉంది.
అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం కోసం యూఎస్ ఫెడరల్ బ్యాంక్ తీసుకున్న దూకుడు నిర్ణయాలతో డాలర్ రాకెట్‌లా దూసుకుపోయింది.
యూఎస్ ఫెడరల్ బ్యాంక్ నిర్ణయాలు భారత రూపాయికి శాపంగా మారాయి
2023 లో రూపాయి పరిస్థితి కాస్త మెరుగవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు
అభివృద్ధి చెందిన దేశాలలో ఆర్ధిక మాంద్యం కొనసాగితే మాత్రం ఇది కష్టం అవుతుంది.