కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా పట్టాలెక్కనుంది.

మొదటి దశలో భాగంగా విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు నడిపేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

డిసెంబర్ రెండో వారంలో అధికారికంగా ప్రారంభించేందుకు విస్తృత స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు.

బుల్లెట్లా దూసుకెళ్తూ ప్రయాణ సమయం తగ్గించేలా ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ త్వరలో విశాఖ-విజయవాడ మధ్య తిరగనుంది. 

వాల్తేరు డివిజన్కు ఈ రైలును కేటాయించగా.. త్వరలోనే విశాఖకు రానున్న ఈ 8 కోచ్ రైలుకు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. 

ఈ రైలు పట్టాలెక్కితే కేవలం 4 గంటల్లో విశాఖ నుంచి విజయవాడకు చేరుకోవచ్చు. 

చైర్కారులో రూ.850, ఎగ్జిక్యూటివ్ క్లాస్లో రూ.1650 వరకు ధర ఉండే ఛాన్సుంది.