భారతీయ రైల్వేలు 'రైల్వే స్టేషన్‌ల పునరాభివృద్ధి'ని ప్రారంభించాయి.

దానిలో భాగంగా, దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్ తన అధికార పరిధిలోని ప్రధాన స్టేషన్ల అప్‌గ్రేడేషన్‌ను చేపట్టింది.

తెలంగాణ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ఉన్న ఈ స్టేషన్‌కు అత్యంత ప్రాధాన్యత ఉంది. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సగటున 200 రైళ్లను నడుపుతున్నారు, రోజుకు సగటున 1.8 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అప్-గ్రేడేషన్ చేపట్టడానికి కాంట్రాక్ట్ ఇవ్వబడింది

దానిని మూడేళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ అమలుకు సుమారుగా ₹ 699 కోట్లు.

మౌలిక సదుపాయాలు మరియు ప్రయాణీకుల సౌకర్యాలతో అనుసంధానించడానికి SCR ఒక మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది.

G + 3 అంతస్తులతో ఉత్తరం వైపు కొత్త స్టేషన్ భవనం & G+3 అంతస్తులతో దక్షిణ వైపు భవనం

స్టేషన్‌కు ఉత్తరం వైపు మల్టీ-లెవల్ పార్కింగ్ & సౌత్ సైడ్‌లో భూగర్భ పార్కింగ్

ఈస్ట్ & వెస్ట్ మెట్రో స్టేషన్‌ల స్కైవేతో అనుసంధానం చేస్తూ ఉత్తరం వైపు నడక మార్గం ఇలా మొదలగు ఏర్పాట్లు చేయనున్నారు.