పింక్ బాల్ టెస్టులో భారత్ 238 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది.

రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 208 పరుగులకే ఆలౌట్ అయింది.

శ్రీలంక కెప్టెన్ దిముఖ్ కరుణరత్నే 107 పరుగులు చేశాడు.

జస్ప్రీత్ బుమ్రా 8 వికెట్లు తీశాడు.

ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా శ్రేయాస్ అయ్యర్ ఎంపికయ్యాడు.

శ్రీలంకపై 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది.

రోహిత్ శర్మ తొలిసారి టెస్టు జట్టుకు సారథ్యం వహించాడు.

స్వదేశంలో భారత్ వరుసగా 15వ సిరీస్‌ను కైవసం చేసుకుని ప్రపంచ రికార్డు సృష్టించింది.