వన్డే పోరుకు సిద్ధమైన భారత్, శ్రీలంక.. పూర్తి వివరాలు మీకోసం..

భారత్ vs శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (IND vs SL) ముగిసింది.

ఇక ఈ రెండు జట్లు వన్డే సిరీస్‌కు సన్నాహాలు ప్రారంభించాయి.

వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్ జనవరి 10న గౌహతిలోని బరస్పరా క్రికెట్ స్టేడియంలో జరగనుంది.

5 రోజుల్లో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లు డే-నైట్‌గా జరుగుతాయి.

టీ20 సిరీస్‌తో పోలిస్తే వన్డే సిరీస్‌లో టీమ్‌ఇండియాలో చాలా మార్పు కనిపిస్తోంది.

ఈ సిరీస్‌ నుంచి సీనియర్ ఆటగాళ్లు తిరిగి వస్తున్నారు. శ్రీలంకతో వన్డేల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వచ్చారు.

అలాగే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ కూడా ఈ సిరీస్ నుంచి వన్డే జట్టులోకి తిరిగి వస్తున్నారు.

భారత్-శ్రీలంక వన్డే సిరీస్ పూర్తి షెడ్యూల్ ఇదే..

తొలి వన్డే: జనవరి 10, సాయంత్రం 1.30 (బాలాస్పరా క్రికెట్ స్టేడియం, గౌహతి)

రెండో ODI: జనవరి 12, సాయంత్రం 1.30 (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)

మూడో ODI: జనవరి 15, సాయంత్రం 1.30 (గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం)