ఆసియా కప్‌లో 3సార్లు ఢీకొట్టనున్న భారత్, పాక్ జట్లు?

ఆసియా కప్ 2022 ఆగస్ట్ 27 నుంచి ప్రారంభం కానుంది.

ఈ టోర్నీ సెప్టెంబర్ 11 వరకు కొనసాగుతుంది.

ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌పైనే అందరి చూపు నిలిచింది.

అయితే, ఈ ఏడాది ఆసియా కప్‌లో ఈ రెండు జట్లు 3సార్లు తలపడనున్నాయి.

షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 28న తొలి పోరు జరగనుంది.

ఇక వార్తల ప్రకారం సెప్టెంబరు 4న రెండోసారి ఇరు జట్లు తలపడే ఛాన్స్ ఉంది.

ఇక మూడో పోరు అంటే ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 11న జరగొచ్చు.

అంటే ఈ రెండు టీంలు ఫైనల్ చేరాల్సి ఉంటుంది.

విశేషమేమిటంటే ఈ మూడు మ్యాచ్‌లు కూడా ఒకే మైదానంలో జరగనున్నాయి.

ఈ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30లకు ప్రారంభం అవుతాయి.