ఉప్పల్ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అదరగొట్టింది
ఈ మ్యాచ్‌లో ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాలతో టీమ్‌ఇండియా పోరు అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉత్కంఠభరితంగా సాగింది
కీలక సమయంలో కలిసొచ్చిన కోహ్లి, సూర్యకుమార్‌ల ఇన్నింగ్స్
చెలరేగిపోయిన సూర్యకుమార్ యాదవ్ అర్ధసెంచరీలతో జట్టును గెలిపించాడు
విరాట్ కోహ్లి ఉప్పల్ స్టేడియం తనకెంత ప్రత్యేకమో చాటుతూ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు
187 పరుగుల భారీ లక్ష్యాన్ని 4 వికెట్లే కోల్పోయి ఛేదించిన టీమ్‌ఇండియా.. సిరీస్‌ను 2-1తో దక్కించుకుంది
ఉప్పల్ స్టేడియంలో తొలి అంతర్జాతీయ మ్యాచ్ జరగడంతో అభిమానులు మైదానాన్ని హోరెత్తించారు