ఆడింది 6.. గెలిచింది 5.. చెన్నైలో ఆస్ట్రేలియా తగ్గేదేలే..

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది.

చెన్నై వన్డేలో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మొత్తంగా ఆస్ట్రేలియా టీం చెన్నైలో తిరుగులేని సత్తా చాటుతోంది.

చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియా మొత్తం 6 మ్యాచ్‌లు ఆడింది.

మొత్తం 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయింది.

అది కూడా 2017లో టీమిండియా చేతిలో ఓడిపోయింది.

దీంతో చెన్నైలో అత్యధిక విజయాలను సొంతం చేసుకుంది.

ఆస్ట్రేలియాకు అచ్చొచ్చిన స్టేడియంలో చెన్నై చేరింది.