ఆసియాకప్ 2023లో భారత్ vs పాకిస్తాన్.. ఒకే గ్రూపులో దాయాదుల పోరు..
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు జైషా రాబోయే రెండేళ్లకు సంబంధించిన ఆసియా క్రికెట్ రోడ్ మ్యాప్‌ను విడుదల చేశారు.
2023, 2024 సంవత్సరాల్లో ఆసియాలో జరిగే ప్రధాన టోర్నమెంట్‌ల సమాచారాన్ని విడుదల చేశారు.
రాబోయే రెండు ఆసియా కప్‌లలో భారత్, పాకిస్తాన్ (IND v PAK) జట్లు ఒకే గ్రూప్‌లో కనిపిస్తాయి.
దీంతో వచ్చే రెండు ఆసియా కప్ టోర్నీలో గ్రూప్ దశలోనే దాయాదులు తలపడునున్నాయి.
కాగా, పాకిస్థాన్ ఆసియా కప్ 2023కి ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే.
పాకిస్తాన్‌లో ఆడేందుకు టీమిండియా వెళ్తుందా లేదా అనేది చూడాలి.
అలాగే మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఈ రెండేళ్లలో సీనియర్ ఆసియా కప్, అండర్-19 ఆసియా కప్, ఎమర్జింగ్ ఆసియా కప్‌తో పాటు పలు క్వాలిఫయర్ ఆసియా టోర్నీలు కూడా జరగనున్నాయి.
మహిళల ఆసియా కప్ 2024లో T20 ఫార్మాట్‌లో ఉంటుంది. ఇందులో భారత్, పాకిస్థాన్‌లు కూడా ఒకే గ్రూపులో ఉన్నాయి.