IND vs WI: అహ్మదాబాద్ స్టేడియంలో భారత ఆటగాళ్ల రికార్డులు..!

భారత గ్రేట్ ఓపెనర్ గవాస్కర్ 1986-97లో ఈ మైదానంలో పాకిస్థాన్‌పై 10,000 టెస్ట్ పరుగులను పూర్తి చేశాడు. ఈ మైలురాయిని అందుకున్న ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

భారత మాజీ కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ కపిల్ 1994లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఒక వికెట్ తీసుకున్నాడు. అయితే ఈ వికెట్‌తో అతను టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

2009లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 30 వేల పరుగులు పూర్తి చేశాడు.

అలాగే 2011 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సచిన్ వన్డేల్లో 18,000 పరుగులు కూడా పూర్తి చేశాడు.

ఫిబ్రవరి 6న ఈ మైదానంలో వెస్టిండీస్‌తో టీమిండియా తలపడినప్పుడు 1000 వన్డేలు ఆడిన ప్రపంచంలోనే తొలి జట్టుగా అవతరిస్తుంది.