టీ20ల్లో 26సార్లు తలపడ్డ భారత్-శ్రీలంక.. టాప్ 10 రికార్డులు ఇవే..
అత్యధిక స్కోరు: 2017 డిసెంబర్ 22న ఇండోర్ టీ20లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 260 పరుగుల భారీ స్కోరు చేసింది.
అత్యల్ప స్కోరు: 29 జులై 2021న జరిగిన కొలంబో T20లో భారత జట్టు కేవలం 81 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అతిపెద్ద విజయం: డిసెంబర్ 20, 2017న కటక్ టీ20లో భారత జట్టు 93 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది.
అత్యధిక పరుగులు: శ్రీలంకపై రోహిత్ శర్మ 17 ఇన్నింగ్స్‌ల్లో 411 పరుగులు చేశాడు.
అతిపెద్ద ఇన్నింగ్స్: 22 డిసెంబర్ 2017న జరిగిన ఇండోర్ T20లో రోహిత్ శర్మ 43 బంతుల్లో 118 పరుగులు చేశాడు.
అత్యధిక 50+ ఇన్నింగ్స్‌లు: విరాట్ కోహ్లీ 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సార్లు 50+ పరుగులు చేశాడు.
అత్యధిక వికెట్లు: యుజ్వేంద్ర చాహల్ 10 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టాడు.
బెస్ట్ బౌలింగ్: ఆర్ అశ్విన్ 14 ఫిబ్రవరి 2016న విశాఖపట్నం టీ20లో కేవలం 8 పరుగులు ఇచ్చి 4 ఓవర్లలో 4 వికెట్లు తీశాడు.
వికెట్ కీపింగ్: భారత్-శ్రీలంక T20 మ్యాచ్‌లలో ఎంఎస్ ధోని వికెట్ల వెనుక అత్యధిక సంఖ్యలో 18 మందిని ఔట్ చేశాడు.
అత్యధిక మ్యాచ్‌లు: దసున్ షనక, రోహిత్ శర్మ ఇద్దరూ 19 మ్యాచ్‌లు ఆడారు.