సూర్య తుఫాన్ సెంచరీ.. బద్దలైన భారీ రికార్డులు.. ఆలిస్టులో తొలి భారత ప్లేయర్..
శ్రీలంకపై అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ భారీ రికార్డులను బద్దలు కొట్టాడు.
ఈ ఏడాది తొలి టీ20 సెంచరీని సూర్యకుమార్ నమోదు చేశాడు.
ఇది సూర్య కెరీర్‌లో ఓవరాల్‌గా మూడో సెంచరీగా నిలిచింది.
సూర్య 45 బంతుల్లో ఈ తుఫాన్ సెంచరీ సాధించాడు. ఇందులో 6 ఫోర్లు, 8 సిక్సులు ఉన్నాయి.
ఫాస్టెస్ట్ సెంచరీ పరంగా రోహిత్ శర్మ (35 బంతుల్లో) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు.
అంతర్జాతీయ టీ20ల్లో 3 సెంచరీలు చేసిన తొలి నాన్ ఓపెనర్‌గా సూర్య నిలిచాడు.
టీ20ల్లో భారత్ తరపున రెండో అత్యధిక సెంచరీల రికార్డు కూడా సూర్యదే కావడం విశేషం.
ఈ లిస్టులో రోహిత్ 4 సెంచరీలతో అగ్రస్థానంలో నిలిచాడు.
సూర్య 3 సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు.
ఇక మూడో స్థానంలో నిలిచిన కేఎల్ రాహుల్ 2 సెంచరీలు చేశాడు.