IND vs PAK: ఈ 4గురిపై ఓ కన్నేయాల్సిందే.. లేదంటే డేంజరే..

అక్టోబర్ 23న టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. రెండు చిరకాల ప్రత్యర్థి జట్ల మ్యాచ్ క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద పోటీగా నిలవనుంది.

గత 12 నెలల్లో 3 టీ20 మ్యాచ్‌ల్లో ఇరుజట్లు తలపడ్డాయి. ఇందులో పాకిస్థాన్ 2 మ్యాచ్‌ల్లో భారత్‌ను ఓడించింది.

భారత్‌తో జరిగిన చివరి 3 మ్యాచ్‌ల్లో మహ్మద్ రిజ్వాన్, షాహీన్ షా అఫ్రిది, మహ్మద్ నవాజ్, కెప్టెన్ బాబర్ అజామ్ మంచి ప్రదర్శన చేశారు.

షాహీన్ షా అఫ్రిది గతేడాది 21 మ్యాచ్‌లు ఆడగా, ఈ ఏడాది ఒకే ఒక్క టీ20ఐ మ్యాచ్ ఆడాడు. 2022 లో గాయంతో ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా ఉన్నాడు.

గత రెండేళ్లలో 22 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 6.5 ఎకానమీ వద్ద 25 వికెట్లు పడగొట్టాడు. అతని అత్యుత్తమ ప్రదర్శన 3/26 వికెట్లు.

రిజ్వాన్ ఆసియా కప్, T20 ప్రపంచ కప్‌లో భారత్‌తో జరిగిన 3 మ్యాచ్‌లలో 193 పరుగులు చేశాడు. 2 ఫిఫ్టీలు చేశాడు. 79* అత్యధిక స్కోరు సాధించాడు. రిజ్వాన్ 130.40 స్ట్రైక్ రేట్, 96.50 సగటుతో పరుగులు చేశాడు.

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం రెండేళ్లలో 48 మ్యాచ్‌లు ఆడాడు. 129.77 స్ట్రైక్ రేట్, 37.87 సగటుతో 1550 పరుగులు చేశాడు. ఇప్పటివరకు భారత్‌తో ఆడిన 3 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 92 పరుగులు చేశాడు.

మహ్మద్ నవాజ్ 2016లో పాకిస్థాన్ తరపున టీ20 అరంగేట్రం చేశాడు. అతను 2016, 2021 ప్రపంచ కప్ స్క్వాడ్‌లలో ఉన్నాడు. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.

ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. నవాజ్ 20 బంతుల్లో 42 పరుగులతో మ్యాచ్‌ను తిప్పేశాడు. ఇదే టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్‌పై 33 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.