ఇండో-పాక్ పోరులో అగ్రస్థానంలో ఎవరిది.. చివరి 5 మ్యాచ్‌ల ఫలితాలు ఇవిగో..

IND vs PAK Last Five T20Is: ఆసియా కప్ 2022 ఆగస్టు 27 నుంచి ప్రారంభమవుతుంది.

ఈ టోర్నీలో ఆగస్టు 28 నుంచి భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.

ఈ టోర్నీలో ఇప్పటివరకు టీమ్ ఇండియా అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన చివరి 5 T20 మ్యాచ్‌ల ఫలితాలను ఓసారి చూద్దాం.

T20 ప్రపంచ కప్ 2021, దుబాయ్- ఈ మ్యాచ్‌లో భారత్ ఇచ్చిన 152 పరుగుల లక్ష్యాన్ని పాక్ కెప్టెన్ బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ అర్ధ సెంచరీల సాయంతో సులువుగా గెలిచింది.

టీ20 ప్రపంచకప్ 2016, కోల్‌కతా- పాకిస్థాన్ అందించిన 118 పరుగులు లక్ష్యాన్ని భారత్ 16 ఓవర్లలోనే సాధించింది.

ఆసియా కప్ 2016, మీర్పూర్- ఈమ్యాచ్‌లో పాక్ కేవలం 83 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లి రాణించడంతో 16 ఓవర్లలోనే భారత జట్టు విజయం సాధించింది.

టీ20 ప్రపంచకప్ 2014- మిర్పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది.

భారతదేశం vs పాకిస్తాన్, అహ్మదాబాద్, 2012- ఈ మ్యాచ్‌లో భారత్ అందించిన 192 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ జట్టు 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.