పాక్‌పై కోహ్లి 'ట్రిపుల్ సెంచరీ'.. తొలి భారతీయుడిగా రికార్డ్..

ఆసియా కప్ 2022 ఆగస్ట్ 27 నుంచి ప్రారంభం కానుంది. రెండో రోజు ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య పోరు జరగనుంది.

ఈ మ్యాచ్‌లో అందరి చూపు విరాట్ కోహ్లీపైనే ఉంది.

పాక్‌తో మ్యాచ్ కోహ్లీ కెరీర్‌లో 100వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కానుంది.

దీంతో మూడు ఫార్మాట్లలో దేశం తరపున 100 మ్యాచ్‌లు ఆడిన తొలి భారత క్రికెటర్‌గా నిలుస్తాడు.

అందరి చూపు విరాట్ కోహ్లీ ఫామ్‌పైనే నిలిచింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ సెంచరీ సాధించి దాదాపు 1000 రోజులైంది.

భారత మాజీ కెప్టెన్ భారత్ తరపున 99 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

ఇందులో కోహ్లీ 50.12 సగటుతో 3,308 పరుగులు చేశాడు.

విరాట్ కోహ్లీ పేరుపై 30 అర్ధశతకాలు ఉన్నాయి.