భారత గడ్డపై 34 ఏళ్ల న్యూజిలాండ్ ఎదురుచూపులు ఫలించేనా?

భారత్, న్యూజిలాండ్ టీంల మధ్య 3 వన్డేల సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడింయలో జరగనుంది.

ఈ మ్యాచ్‌లో జట్టు కమాండ్ రోహిత్ శర్మ చేతిలో ఉంది. న్యూజిలాండ్ కమాండ్ టామ్ లాథమ్ తీసుకున్నాడు.

భారత జట్టు ఇటీవల శ్రీలంకపై వన్డే సిరీస్‌లో 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇదే ఊపులో కివీస్‌ను ఓడించాలని కోరుకుంటోంది.

భారత గడ్డపై వన్డే సిరీస్‌ గెలవాలని న్యూజిలాండ్ జట్టు 34 ఏళ్లుగా ఎదురుచూస్తోంది.

ఈ 34 ఏళ్లలో న్యూజిలాండ్ జట్టు భారత్‌లో 6 వన్డే సిరీస్‌లు ఆడింది. కానీ, ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది.

న్యూజిలాండ్ చివరిసారిగా 2017-18లో భారత్‌లో వన్డే సిరీస్ ఆడింది. 1-2 తేడాతో ఓడిపోయింది.

భారత్-న్యూజిలాండ్ మధ్య ఇప్పటి వరకు మొత్తం 113 వన్డేలు జరగ్గా, ఇందులో ఇరుజట్ల మధ్య గట్టిపోటీ నెలకొంది.