వరుసగా 13 మ్యాచ్‌ల్లో విజయం.. స్వదేశంలో న్యూజిలాండ్ భారీ రికార్డ్

భారత్‌తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది.

307 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన కివీస్ జట్టు మరో 17 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్‌లు కివీస్ జట్టుకు మ్యాచ్‌ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు.

ఈ విజయంతో కివీస్ భారీ రికార్డును సాధించింది.

కివీస్ జట్టు స్వదేశంలో వరుసగా 13వ వన్డే మ్యాచ్‌లో విజయం సాధించచింది.

స్వదేశంలో వరుసగా అత్యధిక వన్డే మ్యాచ్‌లు గెలిచి రికార్డు సృష్టించింది.

కివీ జట్టు ఈ విజయాల ప్రస్థానం ఫిబ్రవరి 2019లో ప్రారంభమైంది.

అంతకుముందు 2015లో కివీ జట్టు జనవరి-డిసెంబర్ మధ్య స్వదేశంలో వరుసగా 12 వన్డేల్లో విజయం సాధించింది.

కివీ జట్టు స్వదేశంలో వరుసగా 10 లేదా అంతకంటే ఎక్కువ వన్డేలు గెలిచిన సందర్భాలు ఇవి రెండు మాత్రమే.