టీమిండియా నుంచి 6గురు ఔట్..బంగ్లాతో బరిలోకి దిగే ప్లేయింగ్ XI ఇదే..
భారత్-బంగ్లాదేశ్ మధ్య బుధవారం నుంచి ఛటోగ్రామ్‌లో తొలి టెస్టు జరగనుంది.
ఈ సిరీస్ భారత జట్టుకు చాలా కీలకమైనది. ఈ రెండు టెస్ట్ మ్యాచ్‌లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ భవిష్యత్తును నిర్ణయించగలవు.
కచ్చితంగా టీమిండియా రెండు టెస్టులు గెలవాల్సిందే. లేదంటే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం కష్టం.
కేఎల్ రాహుల్ సారథ్యంలో టీమిండియా టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంది.
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో గెలిచేందుకు టీమిండియా ప్లేయింగ్ XI ఎలా ఉంటుదనే ఆసక్తిగా మారింది.
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు భారత పాజిబుల్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ
శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్
శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్.