IND vs AUS: అక్కడ 'కింగ్' కోహ్లీనే.. మరోసారి పరుగుల వర్షమేనా..

భారత్, ఆస్ట్రేలియా జట్లు టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ మొహాలీలో జరగనుంది.

విరాట్ టీమిండియా అతిపెద్ద బ్యాట్స్‌మెన్ మాత్రమే కాదు, మొహాలీలో బ్యాట్‌తో పరుగుల వర్షం కురిపించిన లిస్టులో టాప్‌లో ఉన్నాడు.

ఆసియాకప్‌లో భారత్‌ ఆఖరి మ్యాచ్‌లో సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ.. నేరుగా మొహాలీ మైదానంలోకి దిగుతున్నాడు.

పరుగుల పరంగా విరాట్ కోహ్లీకి అదృష్ట మైదానాల్లో మొహాలీ ఒకటి.

ఈ మైదానంలో ఎప్పుడు ఆడేందుకు వచ్చినా పరుగుల వర్షం కురిపించాడు.

మొహాలీలోని పీసీఏ స్టేడియంలో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.

కోహ్లీ ఇప్పటివరకు ఇక్కడ 2 T20I మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 149.51 స్ట్రైక్ రేట్‌తో 154 పరుగులు చేశాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ విరాట్ నాటౌట్‌గా నిలిచాడు.

2016లో మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 51 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

విరాట్ కోహ్లీ 2019 సంవత్సరంలో దక్షిణాఫ్రికాతో పీసీఏ స్టేడియంలో తన రెండవ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు.

విరాట్ కోహ్లీ 52 బంతుల్లో అజేయంగా 72 పరుగులు చేయడంతో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.