ఈ డేంజరస్ బౌలర్‌తో ఇబ్బందే.. టీమిండియాకు భారీ ముప్పు తప్పదా?

భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ మార్చి 17న జరగనుంది.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.

టెస్టు సిరీస్‌లో కంగారూలను 2-1తో ఓడించిన టీమిండియా ఫుల్ జోష్‌తో బరిలోకి దిగనుంది.

ఈ వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా భారత్‌కు ముప్పుగా మారవచ్చు.

2019 క్రికెట్ ప్రపంచ కప్ నుంచి జంపా బౌలింగ్ గణాంకాలు షాకిస్తున్నాయి.

ముఖ్యంగా జంపా బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి చాలా ఇబ్బందులు పడ్డాడు.

భారత్‌పై టెస్టు క్రికెట్‌లో సత్తా చాటిన ఆస్ట్రేలియా స్పిన్నర్లు నాథన్ లియాన్, టాడ్ మర్ఫీ, మాథ్యూ కున్‌మాన్‌లు ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లారు.

ఇక వన్డే సిరీస్‌లో స్పిన్ బౌలింగ్ బాధ్యత ఆడమ్ జంపా, అష్టన్ అగర్‌పై ఉంది.

జంపా 2019 ప్రపంచ కప్ తర్వాత 37 మ్యాచ్‌ల్లో 62 వికెట్లు తీసి అగ్రస్థానంలో నిలిచాడు.

ఆడమ్ జంపా ఎకానమీ రేటు 5 కంటే తక్కువగా ఉంది.