లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించిన తాజా హారర్ సినిమా ‘కనెక్ట్’ ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది
ఈ విషయమై ఓ ప్రముఖ వార్తసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పుకొచ్చారు
ప్రస్తుతం ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆ చిత్రం చిన్నదా పెద్దదా లేదా పాన్ ఇండియా స్థాయా అని ఆలోచించడం లేదు అని నయనతార వెల్లడించింది
ఈ ఏడాది పూర్తిగా బాలీవుడ్ చిత్రాలలో నటిస్తున్నట్లు ఆమె తెలిపింది
‘‘చిత్ర రంగంలో ఇన్ని సంవత్సరాలు కొనసాగడమన్నది చిన్న విషయం కాదు. నా సినీ ప్రయాణంలోనూ ఒడుదొడుకులున్నాయి. ఇప్పుడు అంతా బాగుంది. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’’ అని తన 20 ఏళ్ళ అనుభవాల గురించి చెప్పింది
తనను ఇన్ని సంవత్సరాలగా ఇష్టపడుతున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది
విజయంతోపాటు బాధ్యత మరింత పెరుగుతుందని, తన ప్రమాణాలను ఎప్పుడూ కాపాడుకుంటానని నయనతార చెప్పింది
ప్రస్తుతం బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ‘జవాన్’ సినిమాలో కథానాయకిగా నటిస్తోంది