అమితాబ్ బచ్చన్.. పేరెత్తకుండా ఇండియన్ సినిమా గురించి చెప్పడం సాధ్యం కాదు.
బాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన... లెక్కలేనన్ని సినిమాలు అమితాబ్ లిస్ట్‌లో ఉన్నాయి.
1942 అక్టోబర్ 11న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ (ప్రయాగ) జన్మించారు.
తండ్రి హరివంశరాయ్ బచ్చన్ కవి. తల్లి తేజీ బచ్చన్ పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందిన సిక్కు మహిళ.
అమితాబ్‌కు మొదట వారి తల్లిదండ్రులు ‘ఇంక్విలాబ్’ అనే పేరు పెట్టారు.
ఆ తర్వాత ‘ఎన్నటికీ ఆరని దీపం’ అని అర్ధం వచ్చేలా.. అమితాబ్ అని పేరు మార్చారు. పేరు ప్రభావమో ఏమో అమితాబ్ నాన్ స్టాప్‌గా నటిస్తూనే వున్నారు.
ఆయన ఆర్ట్స్‌లో రెండు పీజీలు చేశారు. ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన కిరోరిమల్ కాలేజ్ లో బీఎస్సీ చేశారు.
1969లో ‘సాత్ హిందుస్థానీ’తో మొదలైన ఆయన నట ప్రస్థానం ‘గుడ్ బై’ వరకు కొనసాగుతూనే ఉంది.
పద్మవిభూషణ్..దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అమితాబ్ బచ్చన్.