దేవదాసు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా.
తొలి సినిమాతోనే గుర్తింపు పొందిన ఈమె ఆ తర్వాత పోకిరి సినిమాతో స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కించుకుంది.
కెరీర్ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
ఈ భామ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ టాలీవుడ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేసి బాలీవుడ్‌కు మారింది.
అయితే తెలుగుతో పోలిస్తే అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇలియానా ఇటీవలే తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ అని చెప్పడంతో చేయడంతో అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా షాక్ అయ్యారు.
తాజాగా మరోసారి తన బేబీ బంప్‌ను షేర్ చేసింది ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఇలియానా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
దీనికి బాలీవుడ్ నటి అతియాశెట్టి లవ్ సింబల్‌ను జతచేసింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.