మీ కలలో అగ్ని, మంటలు, వంట చేయడం వంటికి కనిపిస్తే శుభం జరుగుతుంది. త్వరలో ఉద్యోగం పొందడం, పురోగతి సాధించడం జరుగుతుంది
మీకు కలలో డబ్బు కనిపిస్తే రాబోయే రోజుల్లో మీరు భారీగా డబ్బును పొందబోతున్నారు
మీరు దానిమ్మపండ్లు తింటునట్లు కల వస్తే.. త్వరలో లక్ష్మీదేవి మిమ్మల్ని వరిస్తుంది. ఈ కల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు చిహ్నం
మీ కలలో పసుపు, ఎరుపు రంగులు కనిపిస్తే మీ ప్రతిష్ట పెరుగనుందని అర్థం. విలువైన సంపదలు పొందుతారు
గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు మీకు కల వస్తే.. మీరు త్వరలోనే శుభవార్త వింటారు. ఉద్యోగం, ఉపాధి, ఆర్థిక స్థితి మెరుగుదలకు ఇది చిహ్నం
రైతు, పచ్చని వాతావరణం మీ కలలో వస్తే.. మిమ్మల్ని లక్ష్మీ దేవి వరించనుందని అర్థం
మీ కలలో పాలు, తేనె, పెరుగు కనిపిస్తే శుభ సూచికగా పేర్కొంటారు. భవిష్యత్‌లో ఆర్థికంగా స్థిరపడతారు