మీ కలలో పాము మిమ్మల్ని కాటేస్తే.. మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని అర్థం
దేవుడు, తల్లిదండ్రులు, బంధువులు ఇలా ఎవరినైనా మీరు కలలో చూసినట్లయితే దానిని శుభప్రదంగా పరిగణిస్తారు
కలలో అందమైన స్త్రీ లేదా వనదేవతను చూసినట్లయితే.. ప్రేమికుడు లేదా ప్రేమికురాలితో సయోధ్య కుదురుతుందని అర్ధం
మీరు ఎగురుతున్నట్లుగా కలలో కనిపిస్తే.. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అర్ధం
ఒక వ్యక్తి తాను పోగొట్టుకున్న వస్తువును కలలో పొందినట్లయితే, అతడు రాబోయే జీవితంలో ఆనందాన్ని పొందుతాడు
మీ కలలో బిడ్డను ఒడిలో పెట్టుకుని అడిస్తున్నట్లు కనిపిస్తే.. బిడ్డ కలగాలనే కోరిక త్వరలోనే నెరవేరుతుందని అర్ధం