ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో చాలా బిజీగా గడిపేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేసే పనిలో ఉన్న పవన్ కళ్యాణ్.. ఈ సినిమాతో పాటు వినోదయ సీతం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలని లైనప్ చేశాడు.

అయితే ఈ రెండు సినిమాలు ఇలా ఉండగానే తాజాగా జనవరి 30న యంగ్ డైరెక్టర్ సుజిత్ తో “ఓజి” మూవీ ఓపెనింగ్ హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభమైంది.

 ఆర్ఆర్ఆర్ తరువాత దానయ్య నిర్మిస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ కావడంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాకి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ అందించనుండగా.. ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఓకే అయ్యారు.

అయితే ఈ మూవీ పూజా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కనిపించిన లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ధరించిన వాచ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వాచ్ పైనే ఫోకస్ పెట్టారు అభిమానులు.

పవన్ కళ్యాణ్ ధరించిన వాచ్ ” పనేరాయ్” అనే ప్రముఖ కంపెనీకి చెందినది. దీని ధర 13.52 లక్షలు అని సమాచారం.