ప్రపంచంలో ఎన్నో వింతైన ప్రదేశాలు ఉన్నాయి. ఐతే అవి ఎందుకు అలా ఉన్నాయనే విషయం ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు

అటువంటి ఓ విచిత్ర ప్రదేశం గురించి మీరిప్పుడు తెలుసుకోబోతున్నారు

ఎర్ర సముద్రం గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఉప్పగా ఉండే సముద్రం అని కూడా అంటారు

మియామీ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టుల బృందం ఈ సముద్రంలో దాదాపు 1,770 మీటర్ల లోతులో 'పూల్ ఆఫ్ డెత్' కనుగొన్నారు

ఈ మృత్యు కొలను సౌదీ అరేబియా తీరానికి 5,800 అడుగుల దూరంలో ఉంది

అక్కడికి వెళ్లే ఏ జీవి కూడా బతకదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కొలనులో నీరు తాగినా మృత్యువు తప్పదు

ఈ కొలను నీటిలో సాధారణ సముద్రం నీటి కంటే 7-8 రెట్లు ఉప్పు అధికంగా ఉందని, ఏ జీవి దానిలోకి వెళ్లినా, అది మృత్యువాత పడుతుందని వెల్లడైంది