ఈశాన్య దిశలో రోజూ దీపం వెలిగించండి. ఇది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది

ఇంటి పై కప్పునుంచి చినుకులు పడుతుంటే.. అవి ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి.  ఆరోగ్యానికి మంచిది కాదు

కనుక ఇంటి పై కప్పునుంచి ఎటువంటి లీక్ లేకుండా చూసుకోండి

మెట్ల కింద ఉన్న స్థలాన్ని టాయిలెట్‌గా, స్టోర్‌ రూమ్ గా  లేదా వంటగదిగా ఉపయోగించడం వల్ల నాడీ జబ్బులు, గుండె జబ్బులు వస్తాయి

చదువుతున్నప్పుడు లేదా పని చేస్తున్నప్పుడు, ఉత్తరం లేదా తూర్పు వైపు ముఖం పెట్టండి. ఇది మంచి జ్ఞాపకశక్తి పెంపొందిస్తుంది

తులసి మొక్కలు ఉన్న ఇంట్లో పరిశుభ్రమైన గాలి వీస్తుంది

ఇంట్లో కాక్టస్ , ముళ్ళ మొక్కలను పెంచకూడదు. ఇవి ఇంట్లోని కుటుంబ సభ్యులకు అనారోగ్యం, ఒత్తిడి కలిగేలా చేస్తాయి

ఇంటికి ఈశాన్య మూలలో మెట్లు లేదా మరుగుదొడ్లు నిర్మించవద్దు. ఇలా చేయడం ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది