కొన్ని కూరగాయలు పచ్చిగా తిన్నా.. ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు.

కొన్ని కూరగాయలను ఉడకబెట్టకపోయినా.. లేదా సరిగా వండకపోయినా.. అవి పూర్తి హానికరంగా మారే ప్రమాదం ఉంది.

మొలకెత్తిన బంగాళాదుంపల్లో సోలనిన్(solanine) అనే విషం ఉత్పత్తి అవుతుంది . సరిగా ఉడికించకపోతే ఈ విషం కడుపులోకి పోయే ప్రమాదం ఉంది

సొరకాయ సరిగా ఉడికించకపోతే ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

వంకాయలను సరిగా ఉడికించకపోతే గ్లైకోఆల్కలాయిడ్ సమ్మేళనాలు ఉత్పన్నమవుతాయి.  ఇవి విషపూరితం కానప్పటికీ.. సరిగా వండితే మంచి పోషక ప్రయోజనాలు అందిస్తాయి

 కస్సావా అనేది ఒక రకమైన జాతి చెట్టు దుంపలు. పచ్చి టోపియోకా సైనైడ్ అనే విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది చాలా ప్రాణాంతకమైన విషం. అందుకే ఈ దుంప విషయంలో జాగ్రత్త వహించండి.

మొలకెత్తిన పెసరపప్పు, ఆల్ఫలా బీన్స్ తో అలా జాగ్రత్తగా ఉండాలి. మొలకెత్తిన గింజల్లోకి పాథోజెన్స్ ఈజీగా ప్రవేశించగలవు. వీటి వల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

బ్రకోలీ కూరగాయ ఉడికించినా లేదా స్టీమ్(steam) చేసినా చక్కటి పోషక ప్రయోజనాలు అందిస్తుంది. పోషకాలు క్యాన్సర్ తో పోరాడే సమ్మేళనాలను పెంచుతాయి.