జుట్టుపై అమితమైన కేర్‌ తీసుకునేవారు ఎక్కువవే ఉంటారు. అయినా, అనేక హెయిర్‌ కేర్‌ సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి.

ముఖ్యంగా మగవారికి బాల్డ్‌హెడ్‌ సమస్య. కొంతమందిలో అయితే, 30 దాటకముండే ఈ సమస్య వేధిస్తుంది.

 జుట్టు పెరుగుదలకు కొన్ని పోషకాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. దీంతో బట్టతల రాకుండా నివారించవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.

లండన్‌కు చెందిన వైద్య పరిశోధకులు బషర్‌ బిజ్రా అధిక పోషకాలు ఉన్న పండ్లు బట్టతల రాకుండా నివారిస్తాయని తెలిపారు.

బొప్పాయిలో ప్రతి వెంట్రుకకు పోషకాలను సమానంగా జోడించే పామర్థ్యం ఉంది. కొత్త జుట్టు ఏర్పడటంలో కూడా ఇది సహాయపడుతుంది.

పైనాపిల్‌లోని పుష్కలమైన విటమిన్‌ సీ, మెగ్నీషియం, విటమిన్‌ బీ6తోపాటు ఇతర ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్‌ యాసిడ్స్‌ ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తాయి.

 కీవీ పండులో విటమిన్‌ ఏ, సీ, ఈ, కే పుష్కలంగా ఉంటాయి. జింక్, మెగ్నీషియం, భాస్వరం, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ కూడా ఉంటాయి. ఇవి శిరోజాల పెరుగుదలకు సహకరిస్తాయి

 యాపిల్‌లో విటమిన్‌ ఏ, బీ, సీ కూడా చుండ్రు నుంచి ఉపశమనం కలుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, చెడు కణాలను తొలగిస్తాయి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.