ఎక్కువ కాలం జీవించాలంటే అది మీ ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. చాలా పరిశోధనలలో కూడా ఇదే తేలింది

సమయ పాలన లేని తిండి, అంతేకాక ఆయిల్ ఫుడ్స్‌, కొవ్వు పదార్థాలు తినడం వల్ల రోజు రోజుకి ఆయువు క్షీణిస్తుంది

ఆహార నిపుణులు100 ఏళ్లు బతకాలంటే కచ్చితంగా ఈ ఐదు ఆహారాలను తినాలని చెబుతున్నారు. వాటి గురించి తెలుసుకుందా

పచ్చి తేనెలో ఉండే సహజ పదార్థాలు గుండె జబ్బులతో పాటు కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి

పులియబెట్టిన మేక కేఫీర్‌లో కనిపించే ప్రోబయోటిక్స్ రోగనిరోధక వ్యవస్థని ప్రేరేపిస్తాయి. క్యాన్సర్ కణితుల పెరుగుదలను తగ్గిస్తుంది

దానిమ్మ దీర్ఘకాలం జీవించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే దానిమ్మపండ్లను ఎక్కువగా తినాలి. దానిమ్మ రసం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది

పులియబెట్టిన ఆహారాలు మీ జీవక్రియ రేటుని పెంచుతాయి. ఇవి ఆరోగ్యకరమైన వృద్ధాప్యం, దీర్ఘాయువుని అందిస్తాయి. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతాయి

గ్రీన్ అరటిపండులో ఒక రకమైన ప్రీబయోటిక్ ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని తినడం వల్ల కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 50 శాతం వరకు తక్కువగా ఉంటుంది