ప్రస్తుతం హృద్రోగుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది

గుండె జబ్బులు చాలా బలమైన వ్యక్తిని కూడా క్షణాల్లో కూలిపోయేలా చేస్తాయి

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ అలవాట్లను మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు

మద్యపానం వల్ల బీపీ పెరగడం వెరసి గుండెకు హాని కలిగిస్తాయి. కాబట్టి మద్యం గుండెకు కీడు చేస్తుందని గుర్తించాలి

రెగ్యులర్‌గా కూల్‌డ్రింక్స్‌ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది

నూనె ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. ఇది కాల క్రమేణా గుండెపోటకు దారి తీస్తుంది

ప్రాసెస్‌ చేసిన మాంసంలో ఎక్కువగా ఉండే ఉప్పు అధిక రక్త పోటుకు దారి తీస్తుంది. దీంతో గుండె పోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి

హృద్రోగ సమస్యలకు ప్రధాన కారణం పొగాకు. ఈ అలవాటు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు