లిప్‌స్టిక్ వాడకం నుంచి గర్భిణీ స్త్రీలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు
వారు ఎదిగే క్రమంలో తీవ్రస్థాయి మానసిక సమస్యలు ఎదుర్కుంటారని హెచ్చరిస్తున్నారు
సౌందర్య సాధనాల్లో సధాలేట్స్ అనే రసాయనాలు ఉంటాయి
వాటిని గర్భిణీలు వినియోగిస్తే.. వారికీ పుట్టబోయే పిల్లలపై ప్రభావం ఉంటుంది
గర్భిణులు వాడే రసాయనాల కారణంగా వారి పిల్లలు యుక్త వయసు వచ్చేసరికి చాలా ఇబ్బందులు పడతారని నిపుణులు అంటున్నారు
చురుగ్గా కదల్లేరు, ఆత్మన్యూనత, తీవ్రస్థాయి ఆందోళన, వ్యాకులత, ప్రవర్తన సంబంధ సమస్యలు వస్తాయట
తల్లులు కాబోయేవారు వీటితో పాటు ప్లాస్టిక్ వస్తువులు కూడా వాడకపోతే మంచిదని వారి సూచన